మద్యం ice creams విక్రయం..కేఫ్‌ను సీజ్ చేసిన అధికారులు

ABN , First Publish Date - 2021-10-22T14:53:47+05:30 IST

మద్యం ఐస్ క్రీములు విక్రయిస్తున్న ఓ ఐస్ క్రీం పార్లరుకు ఆహార భద్రతా అధికారులు సీలు వేసిన ఘటన...

మద్యం ice creams విక్రయం..కేఫ్‌ను సీజ్ చేసిన అధికారులు

కోయంబత్తూర్(తమిళనాడు) : మద్యం ఐస్ క్రీములు విక్రయిస్తున్న ఓ ఐస్ క్రీం పార్లరుకు ఆహార భద్రతా అధికారులు సీలు వేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. కోయంబత్తూరు జిల్లాలోని అవినాశి రోడ్డులోని లక్ష్మీ మిల్స్ ప్రాంతంలోని కేఫ్ లో గురువారం ఆహార పరిశుభ్రత ప్రమాణాలను పాటించకపోవడం, మద్యం సీసాలను దుకాణంలో ఉంచిన కారణంగా సీలు వేశారు. ఐస్ క్రీం పార్లర్ లో  మద్యం ఐస్ క్రీమ్‌లను విక్రయిస్తున్నారని అందిన సమాచారంతో ఆహారభద్రతా అధికారులు దాడులు చేశారు. మద్యం ఐస్ క్రీంలకు టీనేజర్లలో డిమాండ్ ఏర్పడిందని అధికారుల దర్యాప్తులో తేలింది.


 మద్యం ఐస్ క్రీములు విక్రయించిన పార్లరును అధికారులు సీజ్ చేశారు.అధికారులు ఐస్ క్రీం పార్లరులో మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.కేఫ్ లో పనిచేస్తున్న కార్మికులు హెయిర్ క్యాప్స్, గ్జౌజులు, ఫేస్ మాస్కులు ధరించలేదని, మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని దర్యాప్తులో తేలింది. కేఫ్ లైసెన్సును రద్దు చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం చెప్పారు.


Updated Date - 2021-10-22T14:53:47+05:30 IST