మన్యంలో వణికిస్తున్న చలి

ABN , First Publish Date - 2022-01-28T05:26:41+05:30 IST

విశాఖ మన్యంవాసులను చలి వణికిస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం అధికంగా ఉండడంతో చలి తీవ్రత పెరిగింది.

మన్యంలో వణికిస్తున్న చలి
చింతపల్లిలో కురుస్తున్న మంచు


  చింతపల్లిలో 9 డిగ్రీలు 

చింతపల్లి, జనవరి 27: విశాఖ మన్యంవాసులను చలి వణికిస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం అధికంగా ఉండడంతో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చలికి ప్రజలు వణుకుతున్నారంటే అతిశయోక్తికాదు. చలితో వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే ఉదయం, రాత్రి వేళ మంచు కూడా దట్టంగా కురుస్తున్నది

 

Updated Date - 2022-01-28T05:26:41+05:30 IST