పత్తి కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-05T04:03:17+05:30 IST

పత్తి పండించిన రైతు ల వద్ద పత్రాలు లేకున్నా కొనుగోలు చేయాలని, మ రుసటిరోజు పత్రాలు స్వీకరించాలని, సమస్యలుం టే తన దృష్టికి తీసుకురావాలని సీసీఐ అధికా రుల ను కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ ఆదేశించారు.

పత్తి కొనుగోలు చేయాలి
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌

 కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌

 జిన్నింగ్‌ మిల్లుల పరిశీలన

 కల్వకుర్తి ఆస్పత్రితో తనిఖీ


ఊర్కొండ, డిసెంబరు 4: పత్తి పండించిన రైతు ల వద్ద పత్రాలు లేకున్నా కొనుగోలు చేయాలని, మ రుసటిరోజు పత్రాలు స్వీకరించాలని, సమస్యలుం టే తన దృష్టికి తీసుకురావాలని సీసీఐ అధికా రుల ను కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ ఆదేశించారు. శుక్రవారం మండలకేంద్రం శివారులోని వెంకటసాయి జిన్నింగ్‌ మిల్లులో పత్తి కొనుగోలును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువస్తున్న పత్తిలో తేమ శాతం ఎంత ఉంటుందని వ్యవసాయ, మార్కెట్‌ శా ఖ అధికారులను అడిగి తెలసుకున్నారు. సీసీఐ అధికారులు డబ్బులు ఎన్నిరోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని అక్కడే ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఏఈవోలు పత్తిసాగు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు.  కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగిస్తే  చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు లేకుండా పత్తి కొనుగోలు జరుగాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌ కుమార్‌, తహసీల్దార్‌, సీసీఐ అధికారులు ఉన్నారు. 

రోగులకు మెరుగైన సేవలు అందించాలి


కల్వకుర్తి అర్బన్‌: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగు లకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ ఆదేశించారు. శుక్రవారం కల్వకుర్తి పట్ట ణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సదర్భంగా అత్యావసర విభాగం తో పాటు, గర్భిణీ, చంటి పిల్లల, శస్త్రచికిత్స వార్డు లను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి న ఓ వ్యక్తి నుంచి ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రిలో  రికార్డులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలను అందించాలన్నారు. ఆస్పత్రి నిర్వహణ బాగా ఉందని వైద్యులను అభినందించారు. కలెక్టర్‌ వెంట వైద్యులు రమేష్‌ చంద్ర, శివరాం, ఆర్డీవో రాజేష్‌, తహసీల్దార్‌ ఉన్నారు. 


ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి


 నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) :  ఓటు హక్కును పొందేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందని జనవరి 1, 2021 నాటికి 18ఏళ్లు నిండిన ప్రతీ ఒకరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా పోలింగ్‌స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ ఆదేశించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ తహసీల్దార్‌ కార్యాల యం నుంచి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్ర మంపై అదనపు కలెక్టర్‌ హన్మంతురెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్‌లతో కలి సి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జిల్లా వ్యా ప్తంగా ఉన్న 792 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని ఆదేశించారు. ఓటరు నమోదుపై ప్రజ ల్లో చైతన్యం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రత్యేక ఓట రు నమోదు కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీ ల మండలస్థాయి అధ్యక్షులతో అవగాహన కల్పిం చాలని రెండు రోజుల నిర్వహించే కార్యక్రమంపై ప్రతి గ్రామంలో టాంటాం నిర్వహించి నూతన ఓటర్లు అధిక సంఖ్యలో నమోదయ్యేలా చూడాల ని ఆదేశించారు. రెవెన్యూ అధికారులెవరికి సెలవులు లేవని తహసీల్దార్లు ఎవరు కూడా మండలాన్ని వదిలి వెళ్లకూడదని కలెక్టర్‌ ఆదేశిం చారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ నాగలక్ష్మీ, డిప్యూటీ తహసీల్దార్‌ ఖాజా, కలెక్టరేట్‌ సిబ్బంది అశోక్‌,  అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T04:03:17+05:30 IST