పెన్నానదిలో కూలిన బ్రిడ్జి

ABN , First Publish Date - 2020-09-18T17:51:30+05:30 IST

మండల పరిధిలోని వేపరాల నుంచి జమ్మలమడుగుకు వెళ్లే రహదారిలో పెన్నానదిపై..

పెన్నానదిలో కూలిన బ్రిడ్జి

మైలవరం(కడప): మండల పరిధిలోని వేపరాల నుంచి జమ్మలమడుగుకు వెళ్లే రహదారిలో పెన్నానదిపై ఉన్న బ్రిడ్జి వరద నీటి ప్రవాహానికి కూలిపోయింది. మైలవరం జలాశయం నుంచి నాలుగు రోజులుగా పెన్నానదికి నీరు విడుదల చేయడంతో కోట్ల రూపాయల ఖర్చు చేసి నిర్మించిన బ్రిడ్జి మూడు చోట్ల కూలిపోయింది. అలాగే మరోచోట గ్రావెల్‌ రోడ్డు వేసిన చోట పూర్తిగా నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. గురువారం మైలవరం జలాశయం నుంచి నీటిని నిలుపుదల చేయడంతో కూలిన, కొట్టుకుపోయిన కాంక్రీట్‌ బయటపడింది.


ఈ రోడ్డు వెంట జమ్మలమడుగు నుంచి వేపరాలకు దగ్గర కావడంతో ప్రజలు అధికంగా వస్తుంటారు. ఈ రోడ్డు కూలిపోవడంతో దొమ్మరనంద్యాల, మోరగుడి మీదుగా చుట్టూ తిరిగి ప్రజలు జమ్మలమడుగుకు రాకపోకలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని బ్రిడ్జికి మరమ్మతు పనులు త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2020-09-18T17:51:30+05:30 IST