కుప్పకూలిన రియల్టీ

ABN , First Publish Date - 2020-08-04T06:09:29+05:30 IST

కొవిడ్‌-19 దెబ్బతో స్థిరాస్తి రంగం (రియల్‌ ఎస్టేట్‌) అల్లాడిపోతోంది. ఎవరూ కొత్తగా ఇళ్లు లేదా ఫ్లాట్‌ కొనేందుకు ఇష్టపడడం లేదు. చేతిలో ఉన్న నాలుగు డబ్బులు

కుప్పకూలిన రియల్టీ

  • జీవితకాల కనిష్ఠ స్థాయిలో సెంటిమెంట్‌
  • మరో ఆర్నెల్ల వరకు ఇంతే 

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 దెబ్బతో స్థిరాస్తి రంగం (రియల్‌ ఎస్టేట్‌) అల్లాడిపోతోంది. ఎవరూ కొత్తగా ఇళ్లు లేదా ఫ్లాట్‌ కొనేందుకు ఇష్టపడడం లేదు. చేతిలో ఉన్న నాలుగు డబ్బులు జాగ్రత్తగా దాచుకునేందుకే ప్రజలు ఇష్టపడుతున్నారు. లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింతగా క్షీణించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశంలో రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ 22 పాయింట్లకు పడిపోయింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది తొమ్మిది పాయింట్లు తక్కువ. గతంలో ఎన్నడూ ఈ సెంటిమెంట్‌ ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోలేదని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సర్వే వెల్లడించింది.  


భవిష్యత్‌ అగమ్యగోచరం: భవిష్యత్‌పైనా బిల్డర్లకు పెద్దగా నమ్మకం కుదరడం లేదు. స్థూల ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తుండటం, ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందనే దానిపై స్పష్టత లేకపోవడం పరిశ్రమ వర్గాలను భయపెడుతోంది. మరో ఆరు నెలల వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. బిల్డర్లు, పీఈ సంస్థలు, బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలను సంప్రదించి నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఈ సర్వే రూపొందించింది. 


పండుగల సీజన్‌పైనే ఆశ: అయితే పండుగల సీజన్‌తో అక్టోబరు నుంచి మార్కెట్‌ కొద్దిగానైనా మెరుగుపడుతుందని పరిశ్రమ వర్గాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు, ఇప్పటి వరకు వెనక్కి తగ్గిన కొనుగోలుదారుల కొనుగోళ్లు, కొన్ని రంగాలు క్రమంగా కోలుకోవడం ఇందుకు దోహాదం చేస్తాయని పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి. 

Updated Date - 2020-08-04T06:09:29+05:30 IST