ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ బకాయిలు వసూలు చేయండి

ABN , First Publish Date - 2021-12-08T05:38:41+05:30 IST

నెలవారీ అద్దె చె ల్లింపులలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తూ తిక శ్రీనివాసరావు హెచ్చరించారు. నిరుపేద ఎ స్సీల జీవనోపాధి కోసం మంజూరు చేసిన చీరా లలోని ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని మంగళవారం ఆయన సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ బకాయిలు వసూలు చేయండి
పరిశీలిస్తున్న శ్రీనివాసరావు

ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశం

రూ.15 లక్షల అద్దెల జాప్యంపై ఆగ్రహం


చీరాలటౌన్‌, డిసెంబరు7 : నెలవారీ అద్దె చె ల్లింపులలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తూ తిక శ్రీనివాసరావు హెచ్చరించారు. నిరుపేద ఎ స్సీల జీవనోపాధి కోసం మంజూరు చేసిన చీరా లలోని ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని మంగళవారం ఆయన సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు వెచ్చించి 16 షాపులతో సముదాయాన్ని నిర్మించి 1992లో నిరుపేద ఎస్సీల జీవనభృతి నిమిత్తం రూ.150 అ ద్దెకు షాపులను కేటాయించారు. 2008లో రూ. 500లకు అద్దెను పెంచి నాటి నుంచి నేటి వరకు అదే బాడుగను ఎస్సీ కార్పొరేషన్‌ కొనసాగిస్తోంది. 

ఎస్సీ షాపింగ్‌ సముదాయం వివాదాలకు నిలయంగా మారింది. చాలా సందర్భాలలో ఇది బ హిర్గతమైంది. ఎస్సీలకు కేటాయించిన దుకాణాలలో ఇతరులు వ్యాపారాలు చేస్తున్నట్లు ఆరోపణ లు రావడంతో పాటు దుకాణాల యజమానులు గా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు వినికిడి. ఈ నే పథ్యంలో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన విలువైన సముదాయాలు అన్యాక్రాంతం కాకుండా ఉండడాలని ఎస్సీ నాయకులు గతంలో ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో ఈడీ విశ్వనాథ్‌ మంగళవారం చేసిన ఆకస్మిక తనిఖీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అద్దెల బకాయి రూ. 15లక్షలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. భారీ స్థాయిలో బకాయిలు ఉండటంపై కార్పొరేషన్‌ సి బ్బందిపై ఈడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు తక్షణమే బకాయిలు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Updated Date - 2021-12-08T05:38:41+05:30 IST