రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

ABN , First Publish Date - 2021-01-21T04:11:45+05:30 IST

అయోధ్యలో నిర్మించనున్న రామ మం దిర నిర్మాణానికి బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలో విరాళాలు సేకరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎంపీ సోయం బాపూరావు ఆధ్వర్యంలో పట్ట ణంలోని టీచర్స్‌ కాలనీ, సుభాష్‌నగర్‌ కాలనీలో ఇంటింటికీ తిరిగి విరాళా లు సేకరించారు.

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
ఆదిలాబాద్‌లో విరాళాలు సేకరిస్తున్న ఎంపీ, బీజేపీ నాయకులు

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 20: అయోధ్యలో నిర్మించనున్న రామ మం దిర నిర్మాణానికి బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలో విరాళాలు సేకరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎంపీ సోయం బాపూరావు ఆధ్వర్యంలో పట్ట ణంలోని టీచర్స్‌ కాలనీ, సుభాష్‌నగర్‌ కాలనీలో ఇంటింటికీ తిరిగి విరాళా లు సేకరించారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉట్నూర్‌: రామ మందిర నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి హిందువులందరూ భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా కార్యదర్శి కోండేరి రమేష్‌ అన్నారు. బుధవారం స్థానిక అయ్యప్ప ఆలయంతో పాటు రామాలయంలో బీజేపీ, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విరాళాల  సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి: రామ మందిర నిర్మాణానికి ప్రతి హిందువూ భాగస్వా మ్యం కావాలని మహరాజ్‌ గిత్తే మారుతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని హన్మాన్‌నగర్‌ కాలనీలో గల హన్మాన్‌ ఆలయంలో ఆర్‌ఎస్‌ ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, బీజేపీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఇందులో సింగిల్‌ విండో చైర్మన్‌ డోంగ్రే మారుతి తదితరులు పాల్గొన్నారు.

జైనథ్‌: రామమందిర నిర్మాణం కోసం మండలంలో భక్తులు నిధులను సేకరిస్తున్నారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ విరాళాలను తీసు కుం టున్నారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్‌రెడ్డి, మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సిడాం రాకేష్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గుడిహత్నూ ర్‌కు చెందిన కామదేనువు గోశాల వ్యవస్థాపకుడు హిందూ వాహిణి జిల్లా అధ్యక్షుడు ఆర్యన్‌ మహరాజ్‌ బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. రామ మందిర నిర్మాణంలో అందరిని భాగస్వాములు చేయాలన్న పిలుపు లో భాగంగా లక్ష రూపాయల చెక్కును శ్రీరామ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కమిటీ జిల్లా ఆర్గనైజర్‌ మధుసూదన్‌, గౌరవ సభ్యుడు వేణుగోపాల్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మానంద్‌, వైస్‌ ఎంపీపీ భారత్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేరడిగొండ: రామ మందిర నిర్మాణం కోసం జరుగుతున్న నిధి సేక రణ, జనజాగరణ ఉద్యమంలో భాగం బుధవారం మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్‌ ఆలయం నుంచి ప్రధాన విధుల గుండా శ్రీరామ జన్మ భూమితీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహిం చారు.  కార్యక్రమంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు జిల్లా సభ్యులు చందాపురే ఆకాష్‌, ఉప మండల సమితి సభ్యులు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

బోథ్‌: మండల కేంద్రంలో బుధవారం రామ జన్మభూమి శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు సూచన మేరకు జన సంపర్కం నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వద్ద శ్రీరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. బోథ్‌లోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి నిధిని సేకరించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌, బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు గొర్ల రాజుయాదవ్‌, వీడీసీ అధ్యక్షులు జి.గంగాధర్‌, వీహెచ్‌పీ భజరంగ్‌దళ్‌ నాయకులు ఎంపీటీసీలు కుర్మె మహేందర్‌,శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

భీంపూర్‌: మండలంలోని అంతర్గం, అర్లి(టి), నిపాని తదితర గ్రామా ల్లో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటా వెళ్లి విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జాజ్జిరి రాకేష్‌, ప్రధాన కార్యదర్శి అంకం అశోక్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల శంకర్‌ తదితరులున్నారు.

బేల: రామాలయ నిర్మాణం కోసం మండల కేంద్రంలో నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌ ఠాక్రె ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరిం చారు. బేల సర్పంచ్‌ ఇంద్రశేఖర్‌, మాజీ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దేవన్న, ఎంపీటీసీ ఓల్లఫ్వార్‌ జ్యోతి దంపతులు విరాళాలు ఇచ్చారు.

Updated Date - 2021-01-21T04:11:45+05:30 IST