జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-10-19T10:24:38+05:30 IST

జగిత్యాల జిల్లా వివిధ సంక్షే మ పథకాల అమలులో ముందుందని, రానున్న రోజుల్లో అధికారులు సమష్టిగా కృషి చేసి మరింత అభివృద్ధి దిశగా జిల్లాను తీసుకువెళ్లాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి

రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జిల్లా పరిషత్‌ సమావేశంలో 11 అంశాలపై చర్చఫసమావేశానికి సగం మంది సభ్యుల డుమ్మా


జగిత్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా వివిధ సంక్షే మ పథకాల అమలులో ముందుందని, రానున్న రోజుల్లో అధికారులు సమష్టిగా కృషి చేసి మరింత అభివృద్ధి దిశగా జిల్లాను తీసుకువెళ్లాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దావ వసంత అధ్యక్షతన ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశం జ రిగింది. ఎజెండాలో 26 అంశాలపై చర్చించాలని నిర్ణయించగా, దాదాపు 11 అంశాలపై చర్చ సాగింది. రెండున్నర గంటల పాటు సాగిన ఈ స మావేశంలో కొంత మంది సభ్యులు మాత్రమే చర్చించారు. అంటే సగం మంది సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. వ్యవసాయ శాఖ, ఉ ద్యానవన శాఖ, పశు సంవర్థక శాఖ, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, విద్యు త్‌ శాఖ, వైద్య, ఆరోగ్యం, సాంఘీక సంక్షేమం, పంచాయతీరాజ్‌, ఆర్‌ అం డ్‌ బీ, డీపీవో, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలపైనే చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజాప్రతిని ధులు అభివృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు.


నూతన జిల్లాలతో అభివృద్ధి చెం దుతుందని, సీఎం కల నెరవేరేలా అందరూ కృషి చేయాలని అన్నారు. జగిత్యాల జిల్లా అన్ని అంశాల్లో ముందుందని, రానున్న రోజుల్లో ఇదే ఒరవడితో ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాం తానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రైతు అవగాహన సదస్సులను ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయా లని సూచించారు. వరద కాలువ వెంట విద్యుత్‌ మోటార్లు పెట్టుకునే రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని, తాను సీఎంతో కూడా మాట్లాడు తానని పేర్కొన్నారు. పాఠశాలల్లో హరితహారం కింద మొక్కలు నాటడం తో పాటు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులంతా శ్రమదానంతో పాఠశా లలను బాగు చేసుకోవాలని అన్నారు. ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన సాగేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని కోరారు. కొందరు ఉద్యోగు లు ప్రజాప్రతినిధుల పట్ల అమ ర్యాదగా ప్రవర్తించడం సరైంది కాదన్నా రు. కోరుట్ల ఏడీఏపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆమెను విధులకు హాజరు కాకుండా చూడాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. 


అనంతరం మెట్‌పల్లి ఖాధీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ చైర్మన్‌గా ఎన్నిక యిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావును మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించారు. 


జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లా డు తూ జిల్లా పరిషత్‌ సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను అధికా రులం తానోట్‌ చేసుకుని పరిష్కారా నికి కృషి చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠ శాలలు, రోడ్లను ఎప్పటికప్పుడు బాగు చేసేం దుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఉద్యోగు లు గౌరవ సభ్యుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీల విషయం లో ఎప్పటిక ప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నెల రోజుల ముందు నుంచే డెలివరీ అయ్యే మహిళల విషయంలో సూచనలు చేస్తూ ఉండాలని కోరారు. 


 సభ్యుల సహకారంతో జిల్లాలో అన్ని సంక్షేమ పథకాల్లో ముందున్నా మని కలెక్టర్‌ రవి అన్నారు. ప్రభుత్వం సూచించిన హరిత హారం, ప్రకృ తి వనం, రైతు వేదికలతో పాటు వ్యవసాయేతర భూముల నమోదులో కూడా జగిత్యాల జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధి కారులను సమన్వయం చేస్తూ జిల్లాను మ రింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఉ ద్యోగులు సభ్యుల పట్ల గౌరవంగా మెలగా లని, ఫాంపాండ్‌ నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వ చ్చిందని, దాదాపు 15 లక్షల అవకతవకలు జరిగాయని, ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపా మన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎస్టీ మహిళ ప్రసవం కోసం వచ్చి చనిపోయిన ఘటనపై కూడా విచారణ చేపడుతామని అన్నారు. 


కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కొందరు అధికారు లు ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. ఫాంపాండ్‌ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి సం బంధిత అధికారిని దీర్ఘకాలిక సెలవులో వెళ్లేలా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయాలన్నారు. వరద కాలువ వెంట విద్యుత్‌ మోటార్లు అమర్చుకునేం దుకు అనుమతులు ఇవ్వాలని, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఈ విషయంలో ప్రవ ర్తిస్తున్న తీరు సక్రమంగా లేదని అన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్‌, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ వెంకట్‌ రావు, జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T10:24:38+05:30 IST