అర్హులందరికీ సంక్షేమ పథకాలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-22T10:40:38+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించి న సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు : కలెక్టర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 21 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించి న సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిం చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. గురువా రం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పలు శాఖల అధికారులతో స మావేశం నిర్వహించారు. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా ఈనెల 26న అర్చ కులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు రూ.5వేల సహాయం అందించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. 


ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని గుర్తించండి

ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించటానికి అన్ని గ్రామాలను జల్లెడ పట్టాలని వైద్యశాఖ సిబ్బందిని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి జిల్లావ్యాప్తంగా ఐదో విడత ఇంటింటా సర్వే చేయాలని చెప్పారు. ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ ఉంచాలని ఆదేశించారు. అనంతరం ప లు అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో జేసీ- 2 చేతన్‌, డీఆర్వో వి.సుబ్బారావు, ప్రత్యేక కలెక్టర్‌ గంగాధర్‌ గౌడ్‌, డీ ఎంహెచ్‌వో అప్పలనాయుడు, డ్వామా పీడీ శీనారెడ్డి, ఓఎస్‌డి చౌడేశ్వరి, రి మ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు, నోడల్‌ అధికారి రిచర్డ్స్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-22T10:40:38+05:30 IST