హరితహారంలో భాగస్వాములవ్వాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-12T10:03:48+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వాసం

హరితహారంలో భాగస్వాములవ్వాలి : కలెక్టర్‌

కీసర/ఘట్‌కేసర్‌ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా గురువారం కీసర మండల కేంద్రంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మొక్కలను నాటారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలన్నారు. ఊరూ రా మొక్కలను విరివిగా పెంచేందుకు పాటుపడాలని కోరారు.  కార్యక్రమంలో స్థానిక సర్పంచులతో పాటు పలువురు  ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బొయపల్లి కొండల్‌రెడ్డి బోర్‌ను ప్రారంభించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు, ఆలయానికి వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు కలుగకుండా బోర్‌ వేయించినట్లు తెలిపారు. ఇంకా నానావత్‌ రెడ్యా నాయక్‌, రాజశేఖర్‌, కే.ఎం రెడ్డి, జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-12T10:03:48+05:30 IST