లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-12-01T05:43:24+05:30 IST

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరిక


గుంటూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గర్భస్థ పూర్త, పిండ ప్రక్రియ చట్టంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ స్కానింగ్‌ సెంటర్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయమూర్తి గోపిచంద్‌ మాట్లాడుతూ తరచూ డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తూ స్కానింగ్‌ సెంటర్లు లింగ నిర్ధారణ జరుపుతున్నారా, లేదా అని తెలుసుకొని వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, అదనపు ఎస్పీ మనోహర్‌రావు, సీడ్స్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు రోషన్‌కుమార్‌, రూరల్‌ సీఐ సి.కరుణాకర్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T05:43:24+05:30 IST