హనుమకొండ జిల్లాలో భారీవర్షాలు..అప్రమత్తం చేసిన కలెక్టర్

ABN , First Publish Date - 2021-09-07T00:50:27+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచించారు. ...

హనుమకొండ జిల్లాలో భారీవర్షాలు..అప్రమత్తం చేసిన కలెక్టర్

హనుమకొండ: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచించారు. రాబోయే ఇరవై నాలుగు గంటలలో భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నగరంలో ప్రజలకు అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం కలక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1115 సంప్రదించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు  తెలిపారు. 

Updated Date - 2021-09-07T00:50:27+05:30 IST