ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-04-03T09:07:10+05:30 IST

జిల్లా ఎక్సైజ్‌ శాఖ సూపరిం టెండెంట్‌ రవీందర్‌రాజుపై జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మార్చి 22న నిర్వహించిన జనతా కర్ఫ్యూ నుం

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

  • స్థానికంగా లేక పోవడమే అసలు కారణం
  • ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగులకు అందని వేతనాలు 

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎక్సైజ్‌ శాఖ సూపరిం టెండెంట్‌ రవీందర్‌రాజుపై జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మార్చి 22న నిర్వహించిన జనతా కర్ఫ్యూ నుంచి స్థానికంగా లేకపోవడంపై జిల్లా కలెక్టర్‌ ఆయనపై మండిపడింది. కరోనా కట్టడికి అన్ని శాఖల అధికారులు ప్రజలతో మమేకమై విస్త్రృతంగా అవ గాహన కల్పిస్తున్న సూపరింటెండెంట్‌ రవీందర్‌రాజు మాత్రం కొద్ది రోజు లుగా విధులకు గైర్హాజరుకావడంతో శాఖ పరమైన ఇబ్బందులు తలె త్తాయి. ఈ విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్‌ నేరుగా సూపరిం టెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఎక్కడ ఉన్నావని అడ గగా స్థానికంగానే ఉన్నానని సమాధానం చెప్పిన లోకేషన్‌ పంపాలని కోరడంతో కంగుతిన్న సూపరింటెండెంట్‌ హుటాహుటిన జిల్లాకు వచ్చి విధుల్లో చేరినట్లు సమాచారం. ఈయన కొంతకాలంగా నిర్మల్‌, ఆదిలా బాద్‌ జిల్లాల ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదటి నుంచి స్థానికంగా ఉండడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగులకు వేతనాలు కూడా అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా అధికారి తప్పిదం వల్లే సిబ్బందికి కష్టాలు పడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఇకనైనా తీరు మార్చుకొని విధుల పట్ల క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ మందలించినట్లు ప్రచారం జరుగుతుంది. 

Updated Date - 2020-04-03T09:07:10+05:30 IST