ఎస్‌ఆర్‌ శంకరన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-24T03:22:19+05:30 IST

బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి తమ సేవలను అందించాలని కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిక్లి కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సూచించారు.

ఎస్‌ఆర్‌ శంకరన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కలెక్టర్‌ నుంచి నియామకపత్రం అందుకుంటున్న యువతి

కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(వీఆర్సీ), అక్టోబరు 23 : బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి తమ సేవలను అందించాలని కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిక్లి కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సూచించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌  వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ గ్రూప్‌ 4 ఉద్యోగాలకు ఎంపికైన 13 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడేళ్ల విరామం తర్వాత ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామన్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ జయంతిని పురస్కరించుకుని నియామక ప్రక్రియ చేపట్టడం శుభపరిణామమన్నారు. భర్తీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసిన జాయింట్‌ కలెక్టర్‌లు, పరిపాలలనాధికారి, సోషల్‌వెల్ఫేర్‌ అధికారులను అభినందించారు. ఉద్యోగాలు పొందిన వారిలో నలుగురు జూనియర్‌ అసిస్టెంట్‌లు, జూనియర్‌ ఆడిటర్‌ ఒకరు, ల్యాబ్‌ అటెండెంట్‌ ఒకరు, ఏడుగురు టైపిస్టులు ఉన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ జీవపుత్రకుమార్‌, సోషల్‌ వెల్ఫేర్‌ జిల్లా అధికారి యూ చెన్నయ్య, సిబ్బంది శ్రీనివాసులు, జోషి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T03:22:19+05:30 IST