ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ మోహనరావు మృతి విచారకరం

ABN , First Publish Date - 2021-05-09T07:39:08+05:30 IST

ఆంధ్రజ్యోతి దినపత్రిక కాకినాడ స్టాఫ్‌ రిపోర్టర్‌ సరాకుల మోహనరావు మృతి విచారకరమని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి సంతాపం తెలిపారు.

ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ మోహనరావు మృతి విచారకరం
ఆంధ్రజ్యోతి యూనిట్‌ కార్యాలయంలో మోహనరావు ఆకస్మిక మృతికి సంతాపంగా మౌనం పాటిస్తున్న బ్రాంచి మేనేజర్‌ శ్రీనివాస్‌, ఉద్యోగులు

కలెక్టర్‌, జేసీలు సంతాపం 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే 8:  ఆంధ్రజ్యోతి దినపత్రిక కాకినాడ స్టాఫ్‌ రిపోర్టర్‌ సరాకుల మోహనరావు మృతి విచారకరమని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి సంతాపం తెలిపారు. పాత్రికేయ వృత్తి జీవితంలో మోహనరావు ఎందరికో మార్గదర్శకునిగా నిలిచారన్నారు. జర్నలిజం రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, జిల్లాలోని వివిధ విభాగాల అధిపతులు, కాకినాడలోని సమాచార పౌర సంబంఽధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎల్‌.స్వర్ణలత, కార్యాలయ అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

పాత్రికేయులకు మార్గదర్శి మోహనరావు

దివాన్‌చెర్వు(కాకినాడ), మే 8: ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌  మోహనరావు పాత్రికేయులకు ఓ మార్గదర్శి వంటివారని ఆంధ్రజ్యోతి బీఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన మోహనరావు సంతాప సభ దివాన్‌చెర్వులోని యూనిట్‌ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైనా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలపై వందలాది కథనాలు రాశారని అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేసి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.



Updated Date - 2021-05-09T07:39:08+05:30 IST