మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-02-28T10:50:15+05:30 IST

మిషన్‌ భగీరథ పనులను ప్రారంభించిన 4 ఏళ్లు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు? పనులు పూర్తి చేసి వెళ్లండి అంటూ అధికారులకు జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి చురకులు వేశారు.

మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేయండి

భగీరథ అధికారులకు కలెక్టర్‌  ధర్మారెడ్డి ఆదేశం


తూప్రాన్‌, ఫిబ్రవరి 27: మిషన్‌ భగీరథ పనులను ప్రారంభించిన 4 ఏళ్లు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు? పనులు పూర్తి చేసి వెళ్లండి అంటూ అధికారులకు జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి చురకులు వేశారు. గురువారం తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి అధికారులతో మాట్లాడారు. నీటి సమస్యల ఉందని చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ డీఈ శ్రీనివా్‌సతో కలెక్టర్‌ మాట్లాడుతూ... ఎఫ్‌సీబీలు బిగించాలన్నారు. కొత్తగా రోడ్లు వేసే ఏరియాలో సోమవారం నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 


కమిటీలు పూర్తి చేశారా!

మున్సిపల్‌ వార్డుల్లో కమిటీలు పూర్తి చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేశారా అని కమిషనర్‌ను ప్రశ్నించారు.  తూప్రాన్‌లో పందుల పెంపకంపై సర్వే చేసినట్లు ఽధర్మారెడ్డికి తెలిపారు. 20 కుటుంబాల పందుల వృత్తిదారులను డ్రైవర్లుగా తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లు మొక్కలు బతికేలా చూడాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, కమిషనర్‌ ఖాజామొహిజుద్దీన్‌, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణగుప్తా, చెలిమెల ప్రియాంక, పల్లెర్ల జ్యోతిరవీందర్‌గుప్తా, బూర్గుపల్లి లావణ్యాదుర్గారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T10:50:15+05:30 IST