Advertisement
Advertisement
Abn logo
Advertisement

వలంటీర్ల హాజరుపై కలెక్టర్‌ అసంతృప్తి

చెన్నూరులో సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్‌


చెన్నూరు, డిసెంబరు 7: సచివాలయ పరిధిలోని వలంటీర్లంతా వారంలో మూడు రోజులు తప్పకుండా కార్యాలయానికి వచ్చి హాజరు వేసి తీరాలని నెలలో వారి హాజరు 90 శాతానికి తగ్గితే ఏమాత్రం సహించబోమని కలెక్టర్‌ విజయరామరాజు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం 1, 2వ గ్రామ సచివాలయాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి రిజిస్టర్లలో వలంటీర్ల హాజరు తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది వేళకు సక్రమంగా రావాలని ప్రతి రికార్డును అప్‌డేట్‌గా ఉంచుకోవాలన్నారు. రికార్డుల నిర్వహణతోనే సచివాలయ పని తీరు ఎలా ఉందో తెలుస్తుందన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు ఓపిగ్గా సమాధానం ఇవ్వాలని మంచి సేవలు అందుతున్నాయని ప్రజల తెలిపేలా వ్యవహ రించాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. 1వ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పనితీరుపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఎంపీడీఓ మహబూబ్‌బీకి సూచిం చారు. అంకితభావంతో పనిచేసి ప్రతి రికార్డును సక్రమంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ అనురాధతో మాట్లాడుతూ సచివాలయాలపై నిరంతర పర్యవేక్షణ జరగాలని తెలిపారు. కార్యక్రమంలో చెన్నూ రు పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారె డ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement