ఫివర్‌ సర్వేలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-07T03:15:08+05:30 IST

జిల్లాలో నిర్వహించే ఫీవర్‌ సర్వేలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టాలని అధికారులను కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు.

ఫివర్‌ సర్వేలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టండి: కలెక్టర్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, మే 6: జిల్లాలో నిర్వహించే ఫీవర్‌ సర్వేలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టాలని అధికారులను కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వైద్య, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయితీ, ఐసిడిఎస్‌, డిఆర్‌డిఓ, అధికారులతో ఫీవర్‌ సర్వే, కరోనావ్యాధి చికిత్సలు, ఆక్సీజన్‌ సరఫరా, వినయోగంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ని కట్టడి చేసి ప్రజలను వైరస్‌ నుంచి రక్షిం చేందుకు 481 గ్రామ పంచాయితీలకు 695, నాలుగు ము న్సిపాల్టీలకు 156 బృందాలను ఏర్పాటు చేసిట్లు తెలి పారు. ఇంటింటి సర్వేలో పాల్గొంటున్న సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంటింటి సర్వే నిర్వహ ణలో వైరస్‌ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి తక్షణమే వారిని హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేయాలన్నారు. ఇచ్చిన మందులను ఎలా వాడాలో వివరించాలన్నారు. తీ సుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో సంప్ర దించాల్సిన వైద్యాధికారుల ఫోన్‌నెంబర్లు కలిగిన కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. ప్రతిప్రాధమిక, క మ్యూనిటీ ఆసుపత్రిల్లో ఓపి సేవలు అందించాలన్నారు. ఓపి సేవల్లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు హోం ఐసో లేషన్‌ కిట్లు పంపిణీచేసి  ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిం చాలన్నారు. హోం ఐసోలేషన్‌ కిట్టులో ఇచ్చిన స్టేరాయిడ్‌ మాత్రలు వైరస్‌సోకి 5రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం వస్తే వైద్య సిబ్బంది సలహాలు తీసుకొని ఆ మా త్రను వాడాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే బృందానికి ప్రజలు సహాకరించాలన్నారు. సర్వే నిర్వహాణకు మండల స్థాయిలో తహసీల్దార్లు, సీడీపీ వోలు, వైద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు. కొవిడ్‌ చికిత్సలు నిర్వహిస్తున్న ప్రవేటు ఆసుపత్రిల్లో చికిత్సలు తీసుకొంటున్న  చార్జీల వివరాల చార్టును ఏర్పాటు చేయాలన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లోనూ ఽధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. వైరస్‌ వ్యాప్తి పటిష్టంగా కట్టడి చే సేందుకు చేపట్టిన ఈ సర్వే నిర్ణిత సమయంలో పూర్తి చే యాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, జిల్లావైద్యాధికారి శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి ముక్కంఠేశ్వరరావు, జి ల్లా కరోనా సర్వేయల్‌ అధికారి చేతన్‌, ఇమ్యూనైజేషన్‌ అ ధికారి డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T03:15:08+05:30 IST