విద్యావారధి ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-04T10:44:55+05:30 IST

కరోనా కారణంగా బోధనకు దూరమైన విద్యార్థులకు వీడియో పాఠాలు చెప్పడానికి విద్యాశకటాన్ని సోమవారం...

విద్యావారధి ప్రారంభం

విద్యా శకటాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 3: కరోనా కారణంగా బోధనకు దూరమైన విద్యార్థులకు వీడియో పాఠాలు చెప్పడానికి విద్యాశకటాన్ని సోమవారం కలెక్టర్‌ జీ.వీరపాండ్యన్‌ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యావారధి కార్యక్రమంలో భాగంగా ఈ శకటం వల్ల గ్రామీణ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.


జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరాం మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎలక్ర్టానిక్‌ డిజిటల్‌ సౌకర్యం లేని విద్యార్థులకు ఈ వాహనం జిల్లాలో ఆగస్టు 3 నుంచి 31వ తేదీ వరకు వివిధ మండలాల్లో షెడ్యూలు ప్రకారం వీడియో పాఠాలు ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ వీడియో పాఠాలు 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులలో రూపొందించినట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు పాఠాల బోధన ఉంటుందని అన్నారు. జిల్లాలోని 29 మండలాల్లోని ఈ విద్యావారధి వీడియో పాఠాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2020-08-04T10:44:55+05:30 IST