ఏ ప్రాంతం నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినా స్పందించాలి

ABN , First Publish Date - 2020-08-14T16:54:29+05:30 IST

జిల్లాలో పల్ల్లె ప్రగతి పనులపై యంత్రాంగం దృష్టి పెట్టింది. గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద జరిగిన పనుల ను అంచనా వేసేందుకు జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాల్లో నిబంధనల ప్రకారం పనులు చేశారో లేదో అనువణువు పరిశీలిస్తు న్నా రు.

ఏ ప్రాంతం నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినా స్పందించాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి 


నందిపేట (మాక్లూర్‌): నిజామాబాద్ జిల్లాలో ని ఏ ప్రాంతం నుంచి ఐసోలేషన్‌ సెంటర్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చినా వెంటనే స్పందించి అం బులెన్స్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నా రాయణరెడ్డి ఆదేశించారు. మాక్లూర్‌లోని కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌, పీహెచ్‌సీ ని ఆయన తనిఖీ చేశారు. ఐసోలేషన్‌ సెంటర్‌లో అంబులెన్స్‌లో ఎల్లప్పుడు అందుబాటులో ఉంచేలా చర్యలు తీ సుకోవాలన్నారు. 108 అందుబాటు లో లేకుంటే ప్రైవేటు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐ సోలేషన్‌ సెంటర్‌లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, రోగులు పెరిగితే సిబ్బందిని పెంచుతామన్నారు. అనం తరం పీహెచ్‌సీని సందర్శించారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్‌లను పరిశీలించారు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో, హైదరాబాద్‌ ప్రైవేటు ఆ సుపత్రిలో కరోనా వైద్యానికి అందించే మందుల తోపాటు వెంటిలేటర్‌తో చికిత్స అంది స్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ ఆంజనేయులు,ఎంపీడీవో సక్రియనాయక్‌, డాక్టర్‌ సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు. 


పకడ్బందీగా అమలుచేయాలి..

భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌లు పకడ్బం దీగా నడిపించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అ న్నారు. గురువారం నాబార్డ్‌,  కృషి విజ్ఞానకేం ద్రం,  వ్యవసాయ బ్యాంకు అధికారులతో ఆయ న సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెండు ఫార్మర్‌ ప్రొడ్యూజర్‌ ఆర్గనైజేషన్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బోధన్‌లో కూరగాయలకు, ఆర్మూర్‌లో పసుపున కు సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్లుతెలిపారు.  ఈ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ను  కలెక్టర్‌ అధ్యక్షతన 300 మంది రైతులతో ఏర్పాటు చే స్తున్నామన్నారు. సమావేశంలో నాబార్డ్‌ డీడీఎం నగేష్‌, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌  బాలాజీ నాయక్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, హర్టికల్చర్‌ అధికారులు పాల్గొన్నారు.  


మరుగు దొడ్ల పనులు పూర్తికావాలి..

జిల్లాలో మూడు మున్సిపల్‌, ఒక కార్పొరేషన్‌ పరిధిలో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ ప నులు ఈ నెల 15 నాటికి పూర్తి కావాలని కలెక్ట ర్‌ ఆదేశించారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ తో పాటు భీమ్‌గల్‌, బోధన్‌, ఆర్మూర్‌లో మరుగు దొడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. నిర్మించిన వాటిలో 50 శాతం స్త్రీలకు కేటాయించాలని, ఈ నెల 15 వరకు ప్రజలకు  అందుబటులో ఉం డాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

Updated Date - 2020-08-14T16:54:29+05:30 IST