Abn logo
Sep 21 2021 @ 23:21PM

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్‌

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 21: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నెలకొల్పిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంగళవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పరిశీలించారు. ఆస్పత్రికి ప్లాంట్‌ సామగ్రి వచ్చి పక్షంరోజులు గడిచినా ఎందుకు ప్రారంభించలేదని సూపరింటెండెంట్‌ స్వామిని అడిగి తెలుసుకున్నారు. పైప్‌లైన్‌ ఏర్పాటులో జాప్యంపై సంబంధిత అధికారిపై కలెక్టర్‌ ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని బాబు జగ్జీవన్‌ రామ్‌చౌక్‌లో విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సజీవన్‌కు విగ్రహం ప్రతిష్టించడానికి గద్దె నిర్మాణానికి ప్రతిపాదనలు వెంటనే తయారుచేయాలని ఆదేశించారు. కార్యక్ర మంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశవరావు, నాయకులు మహేష్‌, సాగర్‌, కిరణ్‌ పాల్గొన్నారు.