Abn logo
Jul 8 2020 @ 04:47AM

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్‌ కర్ణన్‌

రూరల్‌ మండలం మద్దులపల్లిలో డ్రైడే పనుల పరిశీలన


ఖమ్మం రూరల్‌/ కొణిజర్ల/ ముదిగొండ, జూలై 7: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌  సూచించారు. ఖమ్మం రూరల్‌ మండలం, మద్దులపల్లిలో జరుగుతున్న డ్రైడే పనులను మంగళవారం  పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వీధుల వెంట మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.  ఇళ్లల్లో పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్‌ సామగ్రి, పనికిరాని కూలర్లు తదితర వస్తువులను వెంటనే తీసివేయాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న డ్రైడే పనులలో  సర్పంచ్‌తోపాటు, వార్డు సభ్యులు  భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ కర్లపూడి సుభద్ర, కార్యదర్శి అఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

ఖమ్మం మరిన్ని...

Advertisement