నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-12-04T06:22:31+05:30 IST

నివర్‌ తుఫాను ప్రభా వంతో కురిసిన భారీవర్షాలకు జిల్లాలో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, పండిం చిన పంటను కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

విజయవాడ సిటీ: నివర్‌ తుఫాను ప్రభా వంతో కురిసిన భారీవర్షాలకు జిల్లాలో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, పండిం చిన పంటను కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు. తన క్యాంపు కా ర్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ నవంబరు 27, 28న కురిసిన భారీవర్షాలకు జిల్లాలో 1.84 లక్ష ల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చిం దన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పంటనష్ట వివరాలను సేకరిస్తున్నారన్నారు. 15 నాటికి జాబితా పూర్తి చేసి 30 నాటికి రైతులకు రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సీడీ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెడన, మచి లీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు నియోజకవర్గాలు బాగా నష్టపోయాయన్నారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు కౌలురై తులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సుమారు 90శాతం మంది కౌలురైతులు ఈ- క్రాఫ్ట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకు న్నారన్నారు. పంటనష్ట వివరాలపై రైతులు తమ సందేహాలు చెప్పేందుకు 1800 425 440 ట్రోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిం దన్నారు. జేసీ.కె.మాధవీలత, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు పాల్గొన్నారు.

వారంలోపు రైతుల జాబితా సిద్ధం చేయాలి

నివర్‌ తుఫాను పంటనష్టం అంచనాల ఎన్యూమ రేషన్‌ గడువులోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్‌ ఇంతి యాజ్‌ ఆదేశించారు. గురువారం వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లా డుతూ తుఫాను ప్రభావం కారణంగా పంట నష్టపోయిన రైతుల జాబితాను వారంలోపు పూర్తి చేయాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో జేసీ.కె. మాధవీలత, సబ్‌కలెక్టర్లు హెచ్‌ఎం.ధ్యానచం ద్ర, ప్రతిష్ట మంగైన్‌, ఆర్డీవోలు ఖాజావలీ, జి.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ.టి. మోహన్‌రావు, వ్యవసాయ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, అధికారులు, వీఏవోలు పాల్గొన్నారు.

ఉయ్యూరులో పంట లెక్కలు 

ఉయ్యూరు : మండలంలో తుఫానుకు నేలవాలిన వరిపొలాల లెక్కలు తీసుకుంటున్న ట్టు ఉయ్యూరు మండల వ్యవసాయ అధికారి జి.వి.శివప్రసాద్‌ తెలిపారు. పంట నష్టపరిహా రం అంచనా వేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించామన్నా రు. రైతులు తమ వివరాలను రైతుభరోసా కేంద్రా ల్లోని సహాయకులకు అందచేయాలని తెలిపారు. రంగుమారి, మొలకెత్తిన ధాన్యం 5 నుంచి 10 శాతం వరకు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శివప్రసాద్‌ తెలిపారు. అయితే నిండా మునిగిన పరిస్థితుల నుంచి కోలుకోకుండానే మరో తుఫాను హెచ్చరికలు రైతులను మరింత కలవరప రుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కోతకోసిన వరిపనలు నీటిలో నానుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పంట నేలవాలి నీటిలో మురిగిపోతుంది. ఈనేపథ్యం లో గురువారం ఆకాశంలో మబ్బులు కమ్ము కోవడంతో మిగిలిన పంట కూడా దక్కదేమో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగుమారిన ధాన్యం కొనుగోలు 

ముస్తాబాద (గన్నవరం) : రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు ఏవో తేజశ్వి చెప్పారు. గురువారం మండలంలోని ముస్తాబాదలో రంగుమారిన వరి ధాన్యం ఆమె పరిశీలించారు. 5 నుండి 10 శాతం వరకూ రంగు మారిన ధాన్యం అమ్ము కునేందుకు రైతులు ఆర్బీకేల్లో రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలని సూచించారు.

పంటపొలాల పరిశీలన

ఉంగుటూరు : తుఫాను ప్రభావంతో మండలంలో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన పంట పొలాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, రెవెన్యూ అధికారుల బృందం గురువారం పర్యటించింది. ఎస్‌ఆర్‌ఎస్‌, (ఉయ్యూరు) శాస్త్రవేత్త కె.సుధారాణి, విజయవాడ, జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) ఏడీఏ కె.జ్యోతిర్మయి, ఏవో బి.పద్మజ, గన్నవరం ఏడీఏ జె.ఎస్‌.జయప్రద, ఉంగుటూరు తహసీల్దార్‌ ఆర్‌.దుర్గాప్రసాద్‌, ఆర్‌.ఐ.కె.ధామస్‌కుమార్‌, ఏవో. కె.హెప్సిబారాణి, ఏఈవో బి.దుర్గానాగేశ్వరరావు ఇందుపల్లిలో పర్యటించారు. ఈ పర్యటనలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T06:22:31+05:30 IST