కలెక్టర్‌తో ఉపాధి హామీ జాతీయ బృందం భేటీ

ABN , First Publish Date - 2022-01-23T04:50:21+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని జాతీయస్థాయి బృందం పేర్కొన్నది.

కలెక్టర్‌తో ఉపాధి హామీ జాతీయ బృందం భేటీ
కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో భేటీ అయిన ఉపాధి హామి జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం

గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని జాతీయస్థాయి బృందం పేర్కొన్నది. శనివారం ఆ బృంద సభ్యులైన వినయ్‌ గారడే, అనిల్‌ గైక్వాడ్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఈ నెల 14వ తేదీ నుంచి శనివారం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పీఎంఏవై పథకం కింద చేపట్టిన పనులను తనిఖీ చేశామన్నారు. సమావేశంలో డ్వామా పీడీ డాక్టర్‌ ఎం.యుగంధర్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.బ్రహ్మయ్య, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T04:50:21+05:30 IST