వేగంగా సేవలందించాలి

ABN , First Publish Date - 2020-10-24T11:45:41+05:30 IST

ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవ లందించాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు.

వేగంగా సేవలందించాలి

అధికార యంత్రాంగానికి కలెక్టర్‌ ఆదేశం


పాలకొల్లు రూరల్‌/నరసాపు రం, అక్టోబరు 23: ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవ లందించాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. పాల కొల్లు మండలం భగ్గేశ్వరం పం చాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, సిబ్బంది పనితీరు ను, రికార్డులను పరిశీలించారు. ప్రతీ ఉద్యోగి బయోమెట్రిక్‌ వేసిన అనంతరం వారికి కేటాయించిన విధులకు హాజరు కావాలని సూచించారు. సిబ్బంది విధు ల్లో భాగంగా ఎప్పుడు, ఎక్కడికి వెళ్లింది రికార్డుల్లో నమోదు చేయాలని సూచిం చారు. వివిధ సేవలకు ప్రజలు చెల్లించే నగదు మొత్తాన్ని డిజిటల్‌ అసిస్టెంట్‌ తక్షణం ఆన్‌లైన్‌ చేయాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాధ న్‌, తహసిల్దార్‌ జి.మమ్మి, ఆర్‌ఐ, వీఆర్‌వోలు, గ్రామ కార్యదర్శి, కార్యాలయ సిబ్బంది, సచి వాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆధునికీకరించిన ఛాంబర్‌ గదులను కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రారంభించారు.  

Updated Date - 2020-10-24T11:45:41+05:30 IST