Advertisement
Advertisement
Abn logo
Advertisement

82,957 మందికి ‘జగనన్న విద్యాదీవెన’

అనంతపురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జగనన్న విద్యాదీవెన మూడో విడతగా 82,957 మంది విద్యార్థులకు రూ.52.31 కోట్ల లబ్ధిని వారి తల్లుల ఖాతాలకు జమ చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు. మంగళవారం సీఎం జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా బటన నొక్కి, తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యాదీవెన మూడో విడత లబ్ధిని జమచేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్సకు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ నా గలక్ష్మి సెల్వరాజనతోపాటు శాసనమండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రె డ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, ఉషశ్రీచరణ్‌, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన చైర్‌పర్సన నళిని, ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన మంజుల, జేసీ గంగాధర్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న విద్యాదీవెన పథకం 2020-21 సంవత్సరం మూడో విడత కళాశాల ఫీజులను అర్హులైన 92,237 మంది విద్యార్థులకు సంబంధించి 82957 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.52.31 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధి రూ.52.31 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు.. విద్యార్థులకు అందజేశారు. వీడియో కాన్ఫరెన్సలో బీసీ సంక్షేమశాఖ డీడీ యుగంధర్‌, సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన రెడ్డి, డీటీడబ్ల్యుఓ అన్నాదొర, వికలాంగుల శాఖ ఏడీ రసూల్‌, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement