Abn logo
Sep 22 2021 @ 08:34AM

కలెక్టర్‌ ఆదేశాలకు తిలోదకాలు

బలిజేపల్లి చానల్‌కు చుక్క నీరందని తీరు 

400 ఎకరాల్లో దెబ్బతింటున్న పైర్లు

అలసత్వంతో అధికారులు


వేమూరు: గతనెలలో సాగు నీరందక ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంలో పడిన విషయం గ్రహించిన జిల్లా కలెక్టర్‌ స్వయంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఆ సందర్భంలో సాగునీటిని అం దించేందుకు పర్యవేక్షణ కమిటీలు ఏర్పా టు చేసి సాగుకు పుష్కలంగా నీరు అం దించాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలను లెక్క చేయకుం డా సంబంధిత అధికారులు తిలోదకాలిచ్చారు. ఇందుకు తార్కాణం మండలంలోని బలిజేపల్లి ఛానల్‌ పరిధిలోని సాగు దుస్థితి. ఈ ఛానల్‌ కింద బలిజేపల్లి, అబ్బనగూడవల్లి, రావికంపాడు, తాడిగిరిపాడు గ్రామాలకు చెందిన 400 ఎకరాల మాగాణి భూమి సాగులో ఉంది. కాగా, ఈ భూ విస్తీర్ణంలోని రైతు లంతా గత ఏడాది నీటి సమస్య దృష్టిలో పెట్టుకుని వెదనాట్లు వేశా రు. జూలై నెలలో నాట్లు వేసినప్పటి నుండి ఇంత వరకు ఈ ఛానల్‌ కు చుక్కనీరు అందలేదు. కాగా, చెదురుమదురు వర్షాలు పడడం, కొందరు బోరు నీటిపై ఆధారపడి మొదటి విడత తడి నీటితో ఫైరు ను కాపాడుకున్నారు. 20 రోజుల నుంచి వర్షం పడకపోవడం, కాల్వ కు నీరందనందున భూములు నెర్రెలిచ్చాయి. పైర్లు ఎండుబారాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు అధికారులను ఆశ్రయించినా స్పందన కరువైందని వాపోతున్నారు. 


అధికారుల అలసత్వమే కారణం: బొందలపాటి వీరాస్వామి, రైతు, అబ్బనగూడవల్లి

చానల్‌కు నీరు రాకపోవడా నికి అధికారుల అలసత్వమే కారణం. ఇందుకు పైర్లు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు.   నేను నాటిన 3.50 ఎకరాల్లోని వెదనాట్లు నీరందక పూర్తిగా ఎండిపోయి.


ఏఈ వివరణ

దీనిపై నీటి పారుదల శాఖ ఏఈ శరత్‌ను వివరణ కోరగా, జూలై నెలలో కాల్వకు నీరు వదిలామన్నారు. అయితే ముందస్తు పూడికతీయనందున గ్రామ పంచాయతీల వారు గ్రామాల్లోని చెత్తను ఇదే కాల్వలలో వేయడం వల్ల నీరు ఎగతన్నాయన్నారు. పంచాయతీ అధికారులు చెత్తను తొలగించడం లేదని, రెం డు రోజుల్లో తామే చర్యలు చేపట్టి నీటిని అందిస్తామన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption