కరోనాపై అపోహలు తొలగించండి

ABN , First Publish Date - 2020-05-25T09:15:57+05:30 IST

కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించాలని

కరోనాపై అపోహలు తొలగించండి

వైరస్‌పై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలు ప్రతి ఇంటికి పంచండి

సీహెచ్‌సీల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


అనంతపురం, మే 24 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వైద్యాధికారులు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వా డీ, ఆశావర్కర్‌లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లతో వీడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవా ల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రభుత్వం పోస్టర్లు, కరపత్రాలు, బ్రోచర్లు రూపొందించింద ని కలెక్టర్‌ పేర్కొన్నారు. వాటన్నింటినీ ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు ఇంటింటికి తిరిగి ప్రజలకు అందించాలన్నారు.  పొడిదగ్గు, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇ బ్బంది పడుతుంటే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి లే దా ఆస్పత్రికి వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.  వైద్య సహాయం కావాలనుకుంటే 104 లేదా 14410 వైఎస్‌ఆర్‌ టెలీమెడిసిన్‌కు ఫోన్‌ చేయాలన్నారు.


కరోనా పరీక్షలు చేయించుకోదలచిన వారు జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వాస్పత్రి, హిందూపురం, కదిరి ప్రభుత్వాస్పత్రులతో పాటు మొబైల్‌ శాంపిల్‌ కలెక్షన్‌ యూనిట్లను సంప్రదిం చాలని ప్రజలకు తెలియజేయాలన్నారు.  కొవిడ్‌-19 ఏపీ యాప్‌, ఐవీఆర్‌ఎస్‌ 8297104104 నెంబర్‌కు ఫోన్‌ చేయ డం లేదా వాట్సాప్‌ మెసేజ్‌ చేసేలా ప్రజలకు తెలియ జెప్పాలన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తార న్నారు. పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయితే 50 ఏళ్లు పైబడిన వారిని జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రులకు, 60 ఏళ్లు పైడిన వారిని  తిరుపతిలోని స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రికి పంపు తామన్నారు. 50 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వారైతే ఇళ్లల్లో వసతులుంటే స్వీయ గృహ నిర్భందంలో ఉంటూ చికిత్స పొందవచ్చన్నారు.


ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయా లన్నారు.  వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారంతో పాటు నడక, వ్యాయామం, యోగా, ధ్యానం ప్రతిరోజూ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా రెం డేళ్లలోపు పిల్లలకు మాస్కులు వేయరాదన్నారు. కార్యక్ర మంలో సచివాలయాలు, అభివృద్ధి జేసీ డా. సిరి, డీఎఫ్‌ఓ జగన్నాథ్‌సింగ్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-25T09:15:57+05:30 IST