భూహక్కు-భూరక్ష పథకంతో పారదర్శకత

ABN , First Publish Date - 2022-01-19T06:28:25+05:30 IST

భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శా శ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు.

భూహక్కు-భూరక్ష పథకంతో పారదర్శకత

కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

అనంతపురం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శా శ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని నాలుగు సచివాలయాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రారంభించారు. సీఎం వీడియో కాన్ఫరెన్సకు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన, జేసీ ని శాంతకుమార్‌తో సంబంధిత శాఖాధికారులు హాజరయ్యా రు. పామిడి మండలం రామరాజుపల్లి, బత్తలపల్లి మండ లం చెన్నరాయపట్నం, సోమందేపల్లి మండలం కొత్తపల్లె, గాండ్లపెంట మండలం కమతంపల్లి సచివాలయాలను సీఎం వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... జగనన్న శా శ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ప్రజల నుంచి రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే భూసర్వే చేయించనుందన్నారు. గ్రామస్థాయిలోనే భూముల రిజిస్ర్టేషన చే సేందుకు సచివాలయాల్లోనే సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలను ప్రారంభించారన్నారు. ఇదే సందర్భంలో రీ-సర్వే పూర్తి చేసుకుని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ప్రారంభించిన ఆ నాలుగు గ్రామాలకు సంబంధించిన మ్యాపులను సర్వే అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో సర్వే భూ-రికార్డుల శాఖ ఏడీ జీపీ రామకృష్ణ, ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ కృపాకర్‌, రిజిస్ర్టేషన అధికారి ఉమామహేశ్వరి, డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్‌, ల్యాండ్‌ సర్వే అధికారులు పాల్గొన్నారు.


త్వరలో ఇంటింటికీ పైప్‌లైన గ్యాస్‌

త్వరలో ఇంటింటికీ పైప్‌లైన గ్యాస్‌ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు. ఏజీ పీ సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌ను ఆమె చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేచురల్‌ గ్యాస్‌ సదుపాయం జిల్లాకు రావడం గర్వకారణమన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపార్ట్‌మెంటల్‌ క్లియరెన్స త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి, అనంతపురం, హిందూపురం, తాడిపత్రి పట్టణ ప్రజలకు పీఎన్జీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏజీపీ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో రూ.20 కోట్లతో ఎల్‌సీఎనజీ స్టేషనకు సంబంధించిన ప నులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ ఏడాదిలోనే స్టేషన అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్‌ వద్ద ఒక బంకును ఏర్పాటు చేసి, కేజీ రూ.69 ప్రకారం సీఎనజీ సరఫరా ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, తూమకుంట, పుట్టపర్తి, పెనుకొండ, బుక్కరాయసముద్రం, తాడిపత్రి ప్రాంతాల్లో 12 స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. పీఎనజీ నెట్‌వర్క్‌ తాడిపత్రి, హిం దూపురం ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఇంటింటికి గ్యాస్‌ ధరను ప్రస్తుతానికి ఎస్‌సీఎంకి రూ.44గా నిర్ణయించామన్నారు.

Updated Date - 2022-01-19T06:28:25+05:30 IST