Abn logo
Aug 15 2020 @ 18:53PM

ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితులను సమీక్షించిన కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో బ్యారేజ్ వద్ద పరిస్థితులను కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని నదీ పరివాహక ప్రాంత తహసీల్దార్లకు ఆదేశించారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడులో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు భారీ వరద వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను అడుగుమేర ఎత్తి.. 80 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 77 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 44 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల విడుదల చేశారు.

Advertisement
Advertisement
Advertisement