Abn logo
Sep 23 2021 @ 23:43PM

అధికారులు సమన్వయంతో పని చేయాలి

సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

పోలవరం, సెప్టెంబరు 23: ఏజెన్సీ పరిధిలో వైద్య, విద్యా, ఉపాధి హామీ విషయంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సూచించారు. గురువారం ఐటీడీఏ పీవో ఆనంద్‌, ఆర్డీవో కె.ప్రసన్నలక్ష్మిలతో కలిసి అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, డెంగీ, మలేరియా, జ్వరాల తీవ్రతపై క్యాలెం డర్‌ రూపొందించి గ్రామ సచివాలయాల వారీగా సమీక్ష చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ సిజేరియన్‌ కేసులు నమోదవుతున్నాయని, గర్భిణులు, బాలిం తలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేలా చర్య లు తీసుకోవాలన్నారు. రక్తహీనత, స్త్రీ శిశు మరణాల తగ్గుదల తదితర అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని, ఐసీడీఎస్‌ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నప్పటికి మెరుగైన ఫలితాలు రాకపోవడానికి కారణాలు అన్వేషించాలన్నారు. ప్రతీ అధికారి వారి పరిధిలో ఇద్దరు గర్భిణులు, ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యత చేపట్టి ప్రభుత్వ అందిస్తున్న ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అని, వారి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో వేజ్‌ లేబర్‌ కాంపోనెంట్‌ తో ఉపాధి అవకాశాలు పెంచటం సాధ్యమని, ఈ ప్రాంతంలో కేవలం 11శాతం లక్ష్యం సాధించటం అధికారుల పనితీరుకు నిదర్శనమ న్నారు. ఉపాధి కల్పన, కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డాక్టర్‌ మురళీకృష్ణ, డీఎంవో డాక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్‌, ఐసీడీఎస్‌ పీడీ, ఐసీడీఎస్‌ పీఓ ప్రమోదిని తదితరులు పాల్గొన్నారు.