‘కనిగిరి’ కెపాసిటీ ఎంత ?
ABN , First Publish Date - 2020-05-29T10:53:23+05:30 IST
కనిగిరి రిజర్వాయర్ సామర్థ్యం( కెపాసిటీ) ఎంత అని కలెక్టర్ శేషగిరిబాబు ఇరిగేషన్ అధికారులను అడిగారు.
రిజర్వాయర్ పరిశీలనలో కలెక్టర్
బుచ్చిరెడ్డిపాళెం, మే 28 : కనిగిరి రిజర్వాయర్ సామర్థ్యం( కెపాసిటీ) ఎంత అని కలెక్టర్ శేషగిరిబాబు ఇరిగేషన్ అధికారులను అడిగారు. గురువారం బుచ్చిలోని కనిగిరి రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రిజర్వాయర్ సామర్థ్యం, నీటి నిల్వలు గురించి తెలుసుకున్నారు. అనంతరం సదరన్ చానల్‌ను పరిశీలించారు. ఆ చానల్ పరిధిలోని నాగమాంబాపురం కాలువ కింద ఆయకట్టు వివరాలను తెలుసుకున్నారు.
కూలీల కొరతపై ఆరా ?
కూలీల కొరతపై కలెక్టర్ ఆరాతీస్తూ వరినాట్లు వేస్తున్న పొలాలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి రేబాల వెళ్లారు. అక్కడ సచివాలయంలో స్థానిక రైతులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ కృష్ణమోహన్, డీఈఈ మధుసూదన్‌రావు, ఏఈఈ వినయ్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ, ఏవో సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.