సన్న రకాలకే డిమాండ్‌ : కలెక్టర్‌ శరత్‌

ABN , First Publish Date - 2020-05-29T11:11:04+05:30 IST

వరిలో సన్న రకాల పంటకు మంచి డిమాండ్‌తో పాటు గిట్టుబాటు ధర వచ్చే వీలుంటుందని వాటిని సాగు చేయాలని

సన్న రకాలకే డిమాండ్‌ : కలెక్టర్‌ శరత్‌

తాడ్వాయి, మే 28: వరిలో సన్న రకాల పంటకు మంచి డిమాండ్‌తో పాటు గిట్టుబాటు ధర వచ్చే వీలుంటుందని వాటిని సాగు చేయాలని కలెక్టర్‌ శరత్‌ రైతులకు సూచించారు. గురువారం తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం లో రైతులతో వానాకాలం సాగు ప్రణాళికపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగులో సన్నాలు, పత్తి, కంది పంటలు వేసుకుంటే రైతులకు ఆర్థిక లాభం చేకూరుతుందని, వానాకాలంలో మొక్కజొన్న పంటకు డిమాండ్‌ ఉండదని కలెక్టర్‌ రైతులకు సూచించారు. పత్తి పంటకు నిరం తర మద్దతు ధర వస్తుందని అలాగే, సోయాబీన్‌కు డిమాండ్‌ ఉందని తెలిపారు. రైతులకు నిరంతరం రైతు సమన్వయ సమితి కోఆర్టినేటర్లు, వ్యవసాయ విస్తరణా ధికారుల సమన్వయంతో సలహాలు అందజేస్తారని, పంట వేసిన నాటి నుంచి కోత వరకు నిరంతరం వెంబడే ఉండి రైతు సంక్షేమం కోసం పని చేస్తారని ఆయ న అన్నారు. వరి, పత్తి, కంది, సోయాబీన్‌ తదితర పంటల విత్తనాలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేయడం లేదని తెలిపారు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణాధికారిని నియమించడం జరిగిందని తెలిపారు.


రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ విస్తరణా ధికారులను నియమించడం జరిగిందని వారి ద్వారా రైతులకు ఎరువు లు, క్రిమి సంహారక మందుల వినియోగం గురించి  వివరించడం జరుగుతుందని అన్నారు. రైతులు కాంప్లెక్స్‌ ఎరువులు తగ్గించుకోవాలని, క్రిమి సంహారక మందు లను ఇష్టం వచ్చినట్టుగా వినియోగించవద్దని తెలిపారు. ప్రతీ క్లస్టర్‌లో 20 లక్షలతో రైతు వేదిక నిర్మాణం చేయడం జరుగుతుందని రైతు వేదికల ద్వారా రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్‌ అధికా రులు, వ్యవసాయ పరపతి  సంఘాల సభ్యులు, అధికారుల ద్వారా రైతుల సంక్షే మం కోసం పాటు పడడం జరుగుతుందని అన్నారు. రైతుబంధు పథకం రైతులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ శ్రీనివాస్‌, రైతులు, మండల వ్యవసాయాధికారులు శ్రీకాంత్‌, వ్యవసాయ విస్తరణ అధికారులు రజిత, లిఖిత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ జంగి ఇందిరా, ఏఎంసీ డైరెక్టర్‌ గంగారెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ ధర్మారెడ్డి, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T11:11:04+05:30 IST