అంతా క్షేమమేనా..?

ABN , First Publish Date - 2021-05-14T05:38:53+05:30 IST

జిల్లాలోని వివిధ ఆసు పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వీడియో కాల్‌ చేసి వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

అంతా క్షేమమేనా..?
కొవిడ్‌ బాధితులతో వీడియో కాల్‌ మాట్లాడుత్ను కలెక్టర్‌ మిశ్రా

కొవిడ్‌ బాధితులకు కలెక్టర్‌ వీడియో కాల్‌

ఏలూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ఆసు పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వీడియో కాల్‌ చేసి వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య సదు పాయాలపై ఆరా తీశారు. బాధితులకు భరోసానిచ్చేలా ధైర్యం చెప్పారు. జిల్లాలోని పలు ఆసుపత్రుల డాక్టర్లకు గురువారం ఆయన వీడియో కాల్‌ చేసి వారి వద్ద చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులతో స్వయంగా మాట్లా డారు. డాక్టర్ల పర్య వేక్షణ, చికిత్స చేస్తున్న తీరు, మందులు, భోజనం, మరుగుదొడ్ల వసతి వంటి పలు అంశాలను గురించి బాధితు లను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు హెడ్‌ క్వార్టర్‌ ఆసుపత్రి, ఆశ్రం, చైత్ర, నరసాపురం సూర్య, జంగారెడ్డిగూడెం జాబిల్లి, తణుకు ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను వీడియో కాల్‌లో పలకరించారు. తాడేపల్లిగూడెం టిడ్కో లోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, ఏలూరు సీఆర్‌ఆర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోని బాధితులతో ఆయన మాటా ్లడారు. బాధితులందరూ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లాలని కోరారు.   

Updated Date - 2021-05-14T05:38:53+05:30 IST