మార్కెట్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-05T06:18:59+05:30 IST

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులును వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

మార్కెట్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్‌
హుజూర్‌నగర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 4: ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులును వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతవ్యవసాయ మార్కెట్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటుచేయనున్న ఫ్రూట్‌ మార్కెట్‌ నిర్మాణ స్థలాన్ని గురువారం పరిశీలన చేసి ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌తో పాటు ఫ్రూట్‌ మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులో తెస్తామని అన్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్‌, కమిషనర్‌ రామాంజులరెడ్డి పాల్గొన్నారు. 


ఆక్రమణ స్థలాలను స్వాధీనం చేసుకుంటాం : కలెక్టర్‌

హుజూర్‌నగర్‌ / హుజూర్‌నగర్‌ రూరల్‌: ఆక్రమణలకు గురైన మునిసిపల్‌ లేఅవుట్‌ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీపీఏ చేసిన లేఔట్‌ స్థలాలను అమ్ముకున్నా చెల్లవన్నారు. పద్మశాలీ భవన్‌ ప్రాంతంలోని 2,450 గజాల స్థలంతో పాటు సాయిబాబా థియేటర్‌ పక్కనే ఉన్న 5,555 గజాల స్థలం కూడా మునిసిపాలిటీవే అన్నారు. ఎన్‌ఎ్‌సపీ క్యాంప్‌లో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్‌ పరిశీంచారు. పార్క్‌ కూడా ఏర్పాటుచేస్తామన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో వెంకారెడ్డి, కమిషనర్‌ నరే్‌షరెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనారవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు ఉన్నారు. 


కోదాడలో రెండెకరాల్లో మార్కెట్‌

కోదాడటౌన్‌:కోదాడ వ్యవసాయ మార్కెట్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటు కోసం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి స్థల పరిశీలన చేశారు. రెండు ఎకరాలలో మార్కెట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అంతకు ముందు కమిషనర్‌ మల్లారెడ్డి కలెక్టర్‌కు స్థానిక సమస్యలను వివరించారు. కలెక్టర్‌ వెంట మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి, కౌన్సిలర్స్‌, నాయకులు పాల్గొన్నారు.   


‘డంపింగ్‌ యార్డు పనులు మొదలుపెట్టండి’

నేరేడుచర్ల: నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలో డంపింగ్‌ యార్డు పనులు ఎందుకు మొదలుపెట్టలేదని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత నేరేడుచర్లలో సర్వేనెం. 633లో ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. వెంటనే పనులు మొదలెట్టాలని ఆదేశించారు. రెండు గ్రామాలకు డంపింగ్‌ యార్డు దగ్గరగా ఉంటుందని, వేరేచోట రెండెకరాలు కొనుగోలు చేసి ఇస్తాం అక్కడ ఏర్పాటు చేయాలని కోరినా కలెక్టర్‌కు నిరాకరించారు. అదేవిధంగా నేరేడుచర్లలోని జాన్‌పహాడ్‌ రోడ్డులోని ఎన్నెస్పీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయబోయే ఫుడ్‌కోర్టు స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ ఆర్డీవో వెంకారెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ జయబాబు, కమిషనర్‌ గోపయ్య, మేనేజర్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:18:59+05:30 IST