పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-22T06:18:21+05:30 IST

ఇంటర్‌ ప్రథ మ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పకడ్బం దీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు.

పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- విద్యాశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, అక్టోబరు 21 : ఇంటర్‌ ప్రథ మ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పకడ్బం దీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4,311 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముందుగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఇంటర్‌ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T06:18:21+05:30 IST