పోలీసు వీరుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2021-10-22T05:34:12+05:30 IST

సమాజహితం కోసం పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు.

పోలీసు వీరుల త్యాగాలు వెలకట్టలేనివి
ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, రూరల్‌ ఎస్పీ, అధికారులు, ప్రజాప్రతినిధులు

పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో కలెక్టర్‌ 

గుంటూరు, అక్టోబరు 21: సమాజహితం కోసం పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని గురువారం నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌తో పాటు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, విజిలెన్స ఎస్పీ మాధవరెడ్డి, అదనప ఎస్పీ ప్రసాద్‌, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, అప్పిరెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన చంద్రగిరి ఏసురత్నం, అమరవీరుల కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనావంటి ప్రాణాంతక వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల విజృంభణ సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. రూరల్‌ ఎస్పీ మాట్లాడుతూ    ప్రజారక్షణ కోసం పోలీసులు వీరమరణం పొందడం బాధాకరమన్నారు. 17 మంది పోలీసులు కరోనా బారినపడి మృతి చెందారన్నారు. పోలీసు అంటే ఉద్యోగం కాదని, బాధ్యత అనే విధంగా సమాజానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి ప్రారంభమైన ర్యాలీ మూడు బొమ్మల సెంటరు మీదుగా తిరిగి స్థూపం వరకు చేరుకుంది. 

ఇళ్ల స్థలాలు రిజిసే్ట్రషన చేయండి

మావోయిస్టుల ఘాతుకానికి బలైన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిసే్ట్రషన చేయాలని రూరల్‌ ఎస్పీ  కలెక్టర్‌ని కోరారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి కుటుంబసభ్యులతో కలెక్టర్‌,  రూరల్‌ ఎస్పీ సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలో కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని రూరల్‌ ఎస్పీ కోరారు. ఈ విధానంలో కుటుంబసభ్యులు జిల్లా కార్యాలయానికి రాకుండా ఫోన చేస్తే వారి సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదానం

గుంటూరు(సంగడిగుంట): పోలీస్‌ అమరవీరులు దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎస్పీ, విశాల్‌గున్నీ, జేసీ దినేష్‌కుమార్‌ ప్రసంగిస్తూ రక్తదానమే అమర పోలీసులకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన ప్రభావతి, రెడ్‌క్రాస్‌ జిల్లా వైస్‌ చైర్మన రామచంద్రరాజు, జిల్లా కోశాధికారి రవి శ్రీనివాస్‌, జిల్లా యూత కన్వీనర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T05:34:12+05:30 IST