గృహహక్కు పథకం ప్రయోజనాలు వివరించాలి

ABN , First Publish Date - 2021-12-02T06:15:08+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేవరకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

గృహహక్కు పథకం ప్రయోజనాలు వివరించాలి
శంకరన్‌ హాల్‌లో జరిగిన సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌, జేసీలు

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేవరకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని శంకరన్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత సమయం లోపు లబ్ధిదారుల గృహాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం టైటిల్‌ ఇస్తుందని, దాని ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుందన్నారు.  సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, రాజకుమారి, డీఆర్‌వో కొండయ్య, ఎస్‌డీసీ లలిత, ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడీ బసవయ్య, హౌసింగ్‌ ఈఈలు శంకరరావు, స్వరూప వాణి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, మెప్మా పీడీ వెంకటనారాయణ, గురజాల డీఎల్‌పీవో అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-12-02T06:15:08+05:30 IST