Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలి

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించి అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని  కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లోపల, వెలుపల ఎన్నో సవాళ్లని సాయుధ దళాలు ఎదుర్కొని వీరోచితమైన సేవలు అందిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయన్నారు. దేశ రక్షణలో అశువులు బాసిన వీరజవాన్లు, వారిపై ఆధారపడినన కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఏటా డిసెంబరు 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుతోన్నామన్నారు. వ్యాపార, పారిశ్రామికవేత్తలు విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.బాలాజీ, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement