ఫీవర్‌సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-22T06:59:41+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీవర్‌సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.

ఫీవర్‌సర్వేను పరిశీలించిన కలెక్టర్‌
ముథోల్‌ మండలం మచ్చల్‌ గ్రామంలో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌

ముథోల్‌, జనవరి, 21 : రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీవర్‌సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. మచ్కల్‌ గ్రామంలో కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే వివ రాలను పంచాయతీ కార్యదర్శి, ఆశా కార్యకర్తను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటిసర్వేలో భాగంగా కలెక్టర్‌ ముందుగా దిగంబర్‌ అనే గ్రామ స్థుడి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు దిగంబర్‌ తెలిపారు. మళ్లీ బూస్టర్‌డోసు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామంలో కలెక్టర్‌ 20 నిమిషాలు పాటు కాలినడకన పర్యటించారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. పలువురు గ్రామస్థులతో కలెక్టర్‌ మాట్లాడారు. జ్వరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫీవర్‌సర్వేలో వీఆర్‌ఏలు ఎందుకు రాలేదని తహసీల్దార్‌ శ్యాంసుందర్‌ను ప్రశ్నించారు. వీఆర్‌ఏలు సర్వేలో పాల్గొనాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌, జిల్లా ఉప వైద్యాధికారి అశిష్‌రెడ్డి, ఎంపివో అమీర్‌ఖాన్‌, ఏపీవో శిరీష, ఎంపీటీసీ ఆత్మస్వరూప్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:59:41+05:30 IST