ధరణి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-24T11:47:32+05:30 IST

మండల కేంద్రమైన చౌటకూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ప్రక్రియను కలెక్టర్‌ హన్మంతరావు శుక్రవారం పరిశీలించారు. ధరణి పోర్టల్‌ ద్వారా దసరా నుంచి ప్రారంభంకానున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విధానం

ధరణి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

పుల్‌కల్‌, అక్టోబరు 23 : మండల కేంద్రమైన చౌటకూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ప్రక్రియను కలెక్టర్‌ హన్మంతరావు శుక్రవారం పరిశీలించారు. ధరణి పోర్టల్‌ ద్వారా దసరా నుంచి ప్రారంభంకానున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విధానం, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు ధరణి పోర్టల్‌ అంశంపై పలు సూచనలు చేశారు. క్రయ, విక్రయాలకు సంబంధించి అప్‌లోడ్‌ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకుని రిజిస్ట్రేషన్‌ జరిపే టెస్టింగ్‌ తీరును స్వయంగా చెక్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అనుకూలంగా ప్రతి మండలంలో ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై అధికారిక యంత్రాంగం పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ సూచించారు. 

Updated Date - 2020-10-24T11:47:32+05:30 IST