కాల్ చేసుకోవాలి.. ఓ సారి ఫోన్ ఇవ్వు.. అనగానే ఫ్రెండే కదా అని అతడికి ఇచ్చిందా వివాహిత.. అదే ఆమె చేసిన పొరపాటయింది..!

ABN , First Publish Date - 2021-11-17T23:25:00+05:30 IST

వాళ్లిద్దరి పరిచయం మూడేళ్లు.. ఆ యువతి, యువకుడు కాలేజీలో కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు యువతికి పెళ్లయింది. పెళ్లి తర్వాత కూడా వారి స్నేహం అలాగే కొనసాగింది

కాల్ చేసుకోవాలి.. ఓ సారి ఫోన్ ఇవ్వు.. అనగానే ఫ్రెండే కదా అని అతడికి ఇచ్చిందా వివాహిత.. అదే ఆమె చేసిన పొరపాటయింది..!

భోపాల్: వాళ్లిద్దరి పరిచయం మూడేళ్లు.. ఆ యువతి, యువకుడు కాలేజీలో కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు యువతికి పెళ్లయింది. పెళ్లి తర్వాత కూడా వారి స్నేహం అలాగే కొనసాగింది. ఒక రోజు అతడు ఆ యువతిని కలిశాడు. కాల్ చేసుకోవాలి.. ఓ సారి ఫోన్ ఇవ్వు.. అనగానే ఫ్రెండే కదా అని అతడికి సెల్‌ఫోన్ ఇచ్చింది. అదే ఆమె చేసిన పొరపాటయింది. మధ్య‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


గ్వాలియర్‌కు చెందిన రాజేష్ లోధి, దాతియా వాసి అయిన హస్ముఖ్‌ ఇద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి, అదికాస్తా స్నేహంగా మారడంతో మూడేళ్లుగా మంచి స్నేహితులుగా ఉంటున్నారు. హస్ముఖ్‌కు వివాహం జరిగిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇదే క్రమంలో సోమవారం హస్ముఖ్‌కు రాజేష్ ఫోన్ చేసి  షాపింగ్‌కు రమ్మని పిలిచాడు. సరేనని ఆమె బస్సులో బయల్దేరి నాకా చంద్రవడ్ని‌ వరకూ వెళ్లింది. రాజేష్ కూడా బైక్ మీద అక్కడకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్ మీద కేన్సర్ హిల్ వరకు వెళ్లారు. అక్కడ రాజేష్ బైక్ ఆపి ఆ వివాహితను కిందకు దిగమన్నాడు. అనంతరం కాల్ చేసుకోవాలంటూ ఆమెను సెల్ ఫోన్ అడిగాడు. ఫ్రెండే కదా అని ఆమె అతడికి ఫోన్ ఇచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నట్లు నటించిన రాజేష్.. ఆమె చేతిలోంచి పర్సు లాక్కుని బైక్ ‌పై పారిపోయాడు. 


దీంతో ఆ యువతికి అక్కడ ఏం జరుగుతుందో కాసేపటి వరకు అర్థం కాలేదు. తెలియని దారిలో ఒంటరిగా ఉన్న ఆమె బాటసారుల సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ రాజేష్‌పై ఫిర్యాదు చేసింది. పర్సులో రూ. 48వేల నగదుతో పాటు గోల్డ్ చైన్, చెవిదిద్దులు, మంగళసూత్రం ఉన్నాయని పోలీసులకు చెప్పింది. రాజేష్ తనకు మూడు సంవత్సరాలుగా తెలుసని.. అయితే ఎప్పుడూ ఇలా మోసం చేయలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారి రాంనరేష్ యాదవ్ మాట్లాడుతూ.. హస్ముఖ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-11-17T23:25:00+05:30 IST