ఫీజులు కట్టాలంటూ ఒత్తిళ్లు.. కరోనా థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో తల్లిదండ్రులపై కాలేజీల ఒత్తిడి

ABN , First Publish Date - 2022-01-11T21:15:33+05:30 IST

రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మా రిన విద్యాబోధనతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థ కంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు.

ఫీజులు కట్టాలంటూ ఒత్తిళ్లు.. కరోనా థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో తల్లిదండ్రులపై కాలేజీల ఒత్తిడి

పండుగ సెలవుల తర్వాత  పునఃప్రారంభంపై అనుమానమే?

ఆన్‌లైన్‌ క్లాసులతో నెట్‌ కనెక్షన్లకు పెరిగిన గిరాకీ

అదును చూసి రెండింతలు వసూలు చేస్తున్న నిర్వాహకులు


నాగర్‌కర్నూల్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మా రిన విద్యాబోధనతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థ కంగా మారిందని  విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌  పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యా సంవత్సరం ముగి యకముందే వందశాతం ఫీజు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో అంతంతమాత్రంగా నే ఉన్న వ్యాపారాలు, బడ్జెట్‌కు అనుగుణంగా నడు చుకునే ఉద్యోగులు వందశాతం ఫీజు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు చెల్లించకుంటే అవుట్‌ పాస్‌లు కూడా ఇవ్వకపోవడం, నిర్మాణాత్మక మూల్యాంకనం(ఎఫ్‌ఏ-1), సంగ్రహణాత్మాక మదింపు (ఎస్‌ఏ-1)పరీక్షలు రాసేందుకు యాజమాన్యాలు అ నుమతించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆవేదనకు గురిచేస్తోంది. తమ బిడ్డల భవిష్యత్తు కో సం అప్పు చేసి వందశాతం ఫీజులు చెల్లిస్తున్నారు. సాధారణంగా ఏ ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థ ల్లోనైనా నాలుగు విడతలుగా ఫీజు తీసుకుంటారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైననాలుగు నెలలు తర్వాత కొత్త, పాత విద్యార్థుల వద్ద 50శాతం ఫీజు వసూలు చేశారు. సంక్రాంతి సెలవులకు విద్యార్థులను సొంత గ్రామాలకు పంపించే సమయంలో ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ కొర్రీలు పెడుతున్నారు.  


ఉమ్మడి జిల్లాలో 2,47,299 మంది విద్యార్థులు:ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 34 కార్పొరేట్‌ పాఠశాలలు, 660 ప్రైవేట్‌ పాఠశాలలు, 124 జూని యర్‌, 53 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,47,299మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మంది దాకా విద్యార్థులు హైదరాబాద్‌, విజయ వాడ పట్టణాల్లో ఇంటర్‌, డిగ్రీ చదువుతున్నారు. ప్రైవే ట్‌ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి కనిష్టంగా రూ.10వేలు గరిష్టంగా రూ.30వేల ఫీజు వసూలు చేస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.10వేల నుంచి రూ.45వేల వరకు వసూలు చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనాల ఆవశ్యకతను వివరిస్తూ ఇచ్చినం త తీసుకుంటున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలు మా త్రమే బలవంతంగా వసూలు చేసే ధోరణీని అవలం భిస్తుండడంతో తీవ్ర విమర్శలకు దారీ తీస్తోంది.  


పండుగ తర్వాత అనుమానమే సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత విద్యా సంస్థల పునఃప్రారంభం అనుమాననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంకేతాలు కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలకు అందడం వల్లే ముందే ఫీజులు వసూలు చేసే ప్రణాళికను అమలు చేస్తున్న ట్లు తెలుస్తోంది.   వైఫై నడుపుతున్న కొన్ని సంస్థలు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులే ఉంటాయని తెలియడంతో నెలవారి వసూ లు చేస్తున్న చార్జీని రెండింతలు చేశారు. మొదట అడ్వాన్స్‌ చెల్లిస్తేనే కనెక్షన్లు ఇస్తామంటూ డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-11T21:15:33+05:30 IST