అక్టోబరు 4 నుంచి తెరుచుకోనున్న కళాశాలలు

ABN , First Publish Date - 2021-09-18T16:59:24+05:30 IST

కేరళలో కోవిడ్-19 ఆంక్షలను సడలించడంతోపాటు...

అక్టోబరు 4 నుంచి తెరుచుకోనున్న కళాశాలలు

తిరువనంతపురం: కేరళలో కోవిడ్-19 ఆంక్షలను సడలించడంతోపాటు రాష్ట్రంలోని కళాశాలలను కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడాది తరువాత అక్టోబరు 4 నుంచి కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ సజుకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఢిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ తరగతులు కోవిడ్-19 ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫైనల్ ఇయర్ పీజీ కోర్సులు 50 శాతం విద్యార్థుల హాజరుతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తరగతులకు సంబంధించిన టైమ్ టేబుల్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. తరగతులు, లైబ్రెరీ, ల్యాబులు తెరిచేముందు వాటిని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తారన్నారు.



Updated Date - 2021-09-18T16:59:24+05:30 IST