అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలీన్ పావెల్ మృతి

ABN , First Publish Date - 2021-10-19T02:56:45+05:30 IST

అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలీన్ పావెల్ సోమవారం నాడు మృతి చెందారు.

అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలీన్ పావెల్ మృతి

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలీన్ పావెల్ సోమవారం నాడు మృతి చెందారు.  కరోనా కారణంగా పరిస్థితి విషమించి ఆయన మరణించారు. సైన్యంలో తన కెరీర్ ప్రారంభించిన పావెల్ ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా ఆయ్యారు. ఇరాక్‌లో అమెరికా జరిపిన రెండు యుద్ధాల్లోనూ కీలక పాత్ర పోషించారు. విదేశాంగ శాఖను చేపట్టిన తొలి నల్లజాతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పావెల్ తల్లిదండ్రులు ఆఫ్రికా ఖండం నుంచి అమెరికాకు వలస వచ్చారు. పావెల్ మృతి పట్ల దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది. తండ్రి, తాత,భర్తగా ఓ అద్భుతమైన వ్యక్తిని తాము కోల్పోయామని పావెల్ కుటుంబసభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2021-10-19T02:56:45+05:30 IST