కొవిడ్ టీకా వేయించుకున్న కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్

ABN , First Publish Date - 2021-06-14T13:22:50+05:30 IST

కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తాజాగా కొవిడ్ టీకా వేయించుకున్నారు....

కొవిడ్ టీకా వేయించుకున్న కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్

బొగొటా (కొలంబియా): కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తాజాగా కొవిడ్ టీకా వేయించుకున్నారు. కొలంబియా దేశంలో 35 మిలియన్ల మందికి కరోనా నుంచి రోగనిరోధక శక్తినిచ్చే ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా కొవిడ్-19  టీకాల వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. తాను కొవిడ్ మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నానని డ్యూక్ చెప్పారు. కొలంబియా దేశంలో 37,24,705 కరోనా కేసులు నమోదు కాగా, 95,192 మంది మరణించారు. కరోనా బారిన పడిన రోగులకు వైద్యసేవలందించిన వైద్యులు,ఆరోగ్య సిబ్బందికి డ్యూక్ కృతజ్ఞతలు తెలిపారు. 


కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు  అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని సోమాలియా దేశ అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ కోరారు.ఇప్పటికే 17 మిలియన్ల మందికి కొవిడ్ టీకాలు వేశామని చెప్పారు. బొగొటా నగరంలోని మిలటరీ ఆసుపత్రిలో అధ్యక్షుడు డ్యూక్ తోపాటటు మంత్రులు, ఉపాధ్యక్షులు, ప్రథమ మహిళ మరియా జూలియానా రూయిజ్ లు కొవిడ్ టీకాలు వేయించుకున్నారు.

Updated Date - 2021-06-14T13:22:50+05:30 IST