అయోధ్యలో రామ మందిర భూమి పూజ... చూసేందుకు న్యూయార్క్ లో భారీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-07-31T02:07:07+05:30 IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఊపందుకున్న విషయం తెలిసిందే. మొత్తం 70 ఎకరాల్లో భూమిని ఇప్పటికే చదును చేశారు. ఆలయ నిర్మాణానికి గాను ఆగస్టు ఐదవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. భూమిపూజ కార్యక్రమాన్నివీక్షించేందుకు ‘రామాలయం తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఏర్పాట్లు చేసింది.

అయోధ్యలో రామ మందిర భూమి పూజ... చూసేందుకు న్యూయార్క్ లో భారీ ఏర్పాట్లు

న్యూయార్క్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఊపందుకున్న విషయం తెలిసిందే. మొత్తం 70 ఎకరాల్లో భూమిని ఇప్పటికే చదును చేశారు. ఆలయ నిర్మాణానికి గాను ఆగస్టు ఐదవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. భూమిపూజ కార్యక్రమాన్నివీక్షించేందుకు ‘రామాలయం తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఏర్పాట్లు చేసింది.


కాగా... రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని అమెరికాలో ఉంటున్న హిందువుల‌ు కూడా చూడగలిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెవానీ  ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఇందుకోసం 17 వేల చదరపుటడుగుల ర్యాంప్ చుట్టూ భారీ ఎల్ఈడీ నాస్డాక్ డిస్‌ప్లే స్ర్కీన్ ఏర్పాటవుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిరంతర బాహ్య ప్రదర్శనలల్లో ఒకటిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్‌లో... అత్యధిక రిజల్యూషన్ కలిగిన బాహ్య ఎల్ఈడీ స్ర్కీన్ ఇదే కావడం విశేషం. మరో ఆరు రోజుల్లో జరగనున్న భూమిపూజ కార్యక్రమంతోపాటు, రామాలయ డిజైన్ 3 డీ చిత్రాలను కూడా భారీ బిల్ బోర్డులో ప్రసారం కానున్నాయి. 


హిందీ, ఆంగ్ల భాషల్లో 'జై శ్రీరాం' అనే పదాలు, చిత్రాలు, శ్రీరాముడి చిత్రాలు, వీడియోలు, ఆలయ రూపకల్పన, వాస్తుశిల్పానికి సంబంధించిన 3 డీ పోర్ట్రెయిట్స్‌లతోపాటు ఆలయానికి ప్రధాని మోదీ  పునాదిరాయి వేసే చిత్రాలను టైమ్స్ లోని బిల్ బోర్డుల్లో ప్రదర్శించనున్నారు. ఆగస్టు ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రామాలయం శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి.


ఆల‌య భూమి పూజ‌కు ప్ర‌ధాన‌మంత్రి మోదీతోపాటు బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రపంచంలోని హిందువులంతా అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-07-31T02:07:07+05:30 IST