భారీగా పెరనున్న ఎయిర్‌టెల్ టారిఫ్...

ABN , First Publish Date - 2020-10-30T22:14:07+05:30 IST

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ తగలనుంది. రానున్న రోజుల్లో మొబైల్ టారిఫ్ ధరలు భారీగానే పెరగనున్నాయి. అధికారికంగానే ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో... ఇప్పటికే ధరల పెంపుతో సతమతమౌతున్న వినియోగదారులు రానున్న రోజుల్లో మరింత ఆర్ధిక భారాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.

భారీగా పెరనున్న ఎయిర్‌టెల్ టారిఫ్...

ముంబై : ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ తగలనుంది. రానున్న రోజుల్లో మొబైల్ టారిఫ్ ధరలు భారీగానే పెరగనున్నాయి. అధికారికంగానే ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో... ఇప్పటికే ధరల పెంపుతో సతమతమౌతున్న వినియోగదారులు రానున్న రోజుల్లో మరింత ఆర్ధిక భారాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. అంతేకాదు... టెలికం కంపెనీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సహా ఇతర కంపెనీలు చార్జీలు పెంచివేశాయి.


ఇదిలా ఉంటే... రానున్న రోజుల్లో మొబైల్ టారిఫ్ ధరలు మరింత పెరగనున్నాయి. ఎయిర్‌టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విట్టల్ టారిఫ్ ధరల పెంపు ఉంటుందని తెలిపారు. ఎయిర్‌టెల్ ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత ఆయన ఓకాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడారు. అయితే... ధరల పెంపు ఎప్పటినుంచి ఉంటుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 


కాగా యూజర్ నుంచి పొందే సగటు ఆదాయాన్ని(ఏఆర్‌పీయూ) రూ. 200, రూ. 300గా నిర్దేశించుకున్నామని విట్టల్ వెల్లడించారు. సెప్టెంబరు త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ రూ. 162 కు చేరిన విషయం తెలిసిందే. ఏడాది కిందట ఇది రూ. 128 గా ఉంది. దీనిని రూ. 200 కు, ఆ తర్వాత రూ. 300 కు పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.


Updated Date - 2020-10-30T22:14:07+05:30 IST