Abn logo
Sep 19 2021 @ 16:22PM

ఆరు నెలల్లో భారీ రిటర్న్....

హైదరాబాద్ : ఈ ఏడాది మల్టీ బ్యాగర్ స్టాక్స్‌కి కొదువ లేదు. ఎన్ఎస్ఈ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్, బీఎస్ఈ స్మాల్ క్యాప్, బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండీసెస్ జీవితకాల గరిష్టానికి ట్రేడ్ అవుతున్నాయి. తన షేర్‌హోల్డర్లకు మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ను అందిస్తున్న వాటిలో రాజ్ మెడిసేఫ్ ఇండియా కూడా ఒకటి. ఈ ఫార్మా కంపెనీ స్టాక్ తమ షేర్‌హోల్డర్ల ఖాతాలను కళకళలాడేలా చేస్తున్నాయి. ఈ స్మాల్ క్యాప్ ఈక్విటీ షేర్‌కు రూ. 11.95 నుంచి రూ. 36.95 కు పెరిగాయి. గడిచిన ఆరు నెలల్లో తమ షేర్‌హోల్డర్లకు 200 శాతానికి పైగా ఇచ్చాయి.  రాజ్ మెడిసేఫ్ ఇండియా షేర్ ప్రైస్ హిస్టరీ గత వారం ప్రాఫిట్ బుకింగ్ మొదలైన  తర్వాత ఈ స్టాక్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్ గడిచిన నెల రోజుల ట్రేడ్ సెషన్స్‌ను పరిశీలిస్తే... రూ. 41.85 గరిష్టానికి చేరిన తరువాత గత వారం ఈ స్టాక్ 7.5 శాతం పతనమైంది. ఆ తరువాత మాత్రం గడిచిన నెల రోజుల టైమ్ హారిజోన్‌లో ఈ స్టాక్ తమ షేర్‌హోల్డర్లకు 30 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈ సమయంలో ఈ స్టాక్ ఈక్విటీ షేర్ మార్క్‌కు రూ. 28.45 నుంచి రూ. 36.95 కు ఎగిసింది. గడిచిన ఏడాది కాలంలో ఈ స్టాక్ 200 శాతం పెరగగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 270 శాతం పెరిగింది. కోవిడ్ 19 సెకండ్ వేవ్ తర్వాత ఈ స్టాక్ ఆకాశాన్నంటుతోంది.