Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేశంలో... కొద్ది మంది వద్ద భారీ సంపద

బెంగళూరు : ఆర్థిక అసమానతలు తారస్థాయిలో ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని... ‘వరల్డ్ ఇన్-ఇక్వాలిటీ’ నివేదిక వెల్లడిస్తోంది. గత సంవత్సరం(2021)  నివేదిక ప్రకారం భారత్‌లో... కేవలం ఒక శాతం మంది... దేశ సంపదలో 21.7 శాతం వాటాను కలిగి ఉండగా, ఆర్థికంగా వెనుకబడిన 50 శాతం మంది వద్ద కేవలం 13.1 శాతం సంపద మాత్రమే ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అత్యధిక సంపద కలిగిన పది శాతం మంది దేశంలోని సంపదలో 57 శాతం మేర కలిగి ఉన్నారు. వరల్డ్ ఇన్-ఈక్వాలిటీ ల్యాబ్ కో-డైరెక్టర్ లూకాస్ చాన్సల్ మరికొందరు నిపుణుల సహకారంతో ఈ నివేదికను రూపొందించారు. ఆయనకు సహకరించిన వారిలో ఫ్రెంచ్ ఎకనమిస్ట్ థోమాస్ పికెట్టీ కూడా ఉన్నారు.


థోమాస్ మాట్లాడుతూ ‘భారత్‌లో ఆర్థిక అసమానత తీవ్రంగా ఉంది. ఆదాయ అసమానతలు భారత్‌లో  పెరిగిపోతున్నాయి. ఈ(2021) ఏడాది జాతీయాదాయంలో 20 శాతానికి పైగా... కేవలం  ఒక శాతం మంది వద్ద, 57 శాతానికి పైగా సంపద పది శాతం మంది వద్ద ఉన్నాయి. భారత్‌లో వయోజనుల సగటు తలసరి ఆదాయం రూ. 2,04,200 గా ఉంది. ది. సంపదలో అసమానతలు తీవ్రంగా ఉన్నాయి’ అని వెల్లడించారు. 


సంపదలో కింద ఉన్న యాభై శాతం మంది వద్ద దాదాపు ఎనిమిదో వంతు సంపద మాత్రమే ఉందని, మధ్యతరగతి వారి వద్ద 29.5 శాతం సంపద ఉందని తెలిపింది. అతి తక్కువ ఆదాయమున్న 50 శాతం మంది ఏడాదికి రూ. 53,610 మాత్రమే సంపాదిస్తున్నారని నివేదిక వెల్లడించింది. మధ్యతరగతి సగటు సంపద రూ. 7,23,930 గా ఉందని, పది శాతం మంది వద్ద రూ. 63,54,070, అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది వద్ద రూ. 3,24,360 గా ఉందని తెలిపింది. ఇక... 1985 నాటి ఆర్థిక విధానాల వల్ల సంపదలో కింద ఉన్నవారి సగటు ఏడాది సంపద రూ. 53,610 కాగా, టాప్ 10 సంపన్నుల ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. భారత్‌లోని కుటుంబాల సగటు రూ. 9,83,010. ఇక... 1985 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక విధానాలు ఆదాయం, సంపదల  విషయంలో అసమానతలను పెంచాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పైన ఉన్న ఒక శాతం మంది...  ఆర్థిక సంస్కరణల వల్ల భారీ లబ్ధి పొందారని తెలిపింది. 

ఇక మొత్తం ఆదాయంలో మహిళా కార్మికుల వాటా కేవలం 18 శాతమే. ఇది ఆసియా సగటు 21 శాతం కంటే తక్కువ. ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియా దేశాల సగటు మాత్రం 15 శాతంతో భారత్ కంటే తక్కువగా ఉంది. 

Advertisement
Advertisement